తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చిరివేళ్ల సాయి మహంతీర్ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విశిష్ట యువసేవ అవార్డును అందుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మహంతీపూర్ అందిస్తున్న విశిష్ట సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఆంధ్ర విద్యార్థి సంఘం ఈ అవార్డును ప్రదానం చేసింది.