తాడేపల్లిగూడెం: మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు

80చూసినవారు
తాడేపల్లిగూడెం: మద్యం షాపుల దరఖాస్తుల గడువు  పొడిగింపు
తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీత సామాజిక వర్గానికి నాలుగు మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తుల గడువును ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ సీఐ ఇ. స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం హాల్లో 10వ తేదీన ఉదయం 10 గంటలకు లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్