తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి. రాజారావు తెలిపారు. ఆదివారం పాఠశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి ఆరవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.