తాడేపల్లిగూడెం: కార్మికుల సమస్యలపై సీపీఎం పోరాటం

64చూసినవారు
తాడేపల్లిగూడెం: కార్మికుల సమస్యలపై సీపీఎం పోరాటం
కార్మికుల సమస్యలపై సీపీఎం పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు అన్నారు. సీపీఎం జిల్లా 26వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ వరకు భీమవరం సీపీఎం మహాసభలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యాండ్రపు నాగేశ్వరరావు, చల్లా చంద్రరావు, కొన్న బత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్