సమతుల పోషకాలు కలిగిన ఆహారంతో వ్యాధులను నియంత్రించవచ్చని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ టి. అశోక్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని నన్నయ్య వర్సిటీ క్యాంపస్ లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు శారీరిక శ్రమ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ రాజు, ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు.