తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన కనకదుర్గమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరు కావాలంటూ వైసీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాంను ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వడ్డీ రఘురాం నాయుడు రూ. 20వేలు విరాళాన్ని అందజేశారు. జడ్పిటిసి ఆంజనేయులు, సతీష్ పాల్గొన్నారు.