తణుకు పట్టణంలో వేంచేసియున్న శ్రీ సూర్య దేవాలయంలో రథసప్తమి నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 11. 30 గంటలకు సూర్య భగవానునికి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 గంటల నుంచి స్వామి వారి దివ్య దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి సన్నిధిలో పుష్పయాగం జరుగుతుందని కమిటీ సభ్యులు వెల్లడించారు.