ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకులో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాతవూరు 6, 7వార్డుల్లో నిర్వహించే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఇన్‌ఛార్జి కలెక్టర్ సూర్యకుమారిలు హాజరవుతారని చెప్పారు.