గీత కులాలకు నోటిఫై చేసిన మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 8 వరకు పొడిగించినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి బుధవారం తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఈనెల 10వ తారీఖు ఉదయం 10 గంటలకు భీమవరం కలెక్టరేట్లో లాటరీ నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత కులాలకు నోటిఫై చేసిన షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.