తణుకు ఆర్టీసీ డిపోను ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం సందర్శించారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండు ఆవరణలో నిర్మించనున్న పింక్ టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్టాండు ఆవరణలో చలివేంద్రాన్ని పరిశీలించారు. తణుకు ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.