తణుకు: కోళ్లను కాలువలో పడవేయొద్దు

69చూసినవారు
చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో కోళ్లలో వైరస్ వ్యాపిస్తుందని దీంతో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి మురళీకృష్ణ చెప్పారు. మంగళవారం తణుకు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసహజంగా చనిపోతున్న కోళ్లను ఎక్కడపడితే అక్కడ ముఖ్యంగా పంట కాలవలో వేయకుండా పూడ్చి పెట్టాలని సూచించారు. అదేవిధంగా చికెన్, గుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి మనుషులకు సోకదని చెప్పారు.

సంబంధిత పోస్ట్