తణుకు: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

62చూసినవారు
తణుకు: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అత్తిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. శ్యామ్యూల్ కోరారు. ఈనెల 10న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అత్తిలి మరియు మంచిలి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారులు డా. కె. నాగరాజు, డా టి. కిరణ్మయి నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్