తణుకు మండలం పైడిపర్రులో ఫ్లెక్సీ వివాదంలో శనివారం వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మోపిదేవి శివకు చెందిన ఫ్లెక్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తొలగించి ఇంటి వెనుక పెట్టుకున్నాడు. యర్రంశెట్టి మణికంఠ, యర్రంశెట్టి సాయి మరి కొంతమంది ఫ్లెక్సీను తీసుకు వెళుతున్న క్రమంలో శివ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుండగా నాగేంద్ర సాయి గణేశ్ వచ్చి సముదాయిస్తుండగా మణికంఠ చాకుతో దాడి చేశాడు.