తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ చెప్పినట్లుగా నేను ధైర్యం ఉన్నవాన్ని కాబట్టే. నా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గోవధ కర్మాగారాన్ని ఆపగలిగానని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ఇప్పుడు రాధాకృష్ణ దమ్ము, ధైర్యం ఏమైంది? దేనికి దాసోహం అయింది. ఆయన్ని గెలిపించిన ప్రజల మీద ఆయనకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.