తణుకు పట్టణ పరిధిలోని స్థానిక 28వ వార్డులో
ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి,
జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు
ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు.