కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీపీఎం ప. గో. జిల్లా సెక్రటరీ సభ్యులు కేత గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఇరగవరంలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోపాలన్ మాట్లాడుతూ. రాష్ట్రంలో 40 లక్షల కౌలు రైతులకు జీవనాధారమైన కౌలు గుర్తింపు కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.