తణుకు పట్టణంలో అత్యంత ఘనంగా తిరంగా యాత్రను ఆదివారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరీమిల్లి రాధాకృష్ణ పాల్గొని మునిసిపల్ ఆఫీస్ నుండి వెంకటేశ్వర థియేటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని ఆపరేషన్ సింధూర్ కు వారి మద్దతును, మన భారత సైనికులకు ధన్యవాదాలను, వారి దేశభక్తిని తెలియచేసారు. అలాగే వెంకటేశ్వర థియేటర్ కూడలిలో మాజీ సైనికులను సన్మానించుకోవటం జరిగింది.