నర్సాపురం మండలం వేములదీవిలో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం, శనివారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయాన్నే హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించారు. ఆలయ అర్చకులు పెద్దింటి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వామి వారికి సహస్రనామార్చన, పూజా కైంకర్యాలు జరిగాయి.