ఆకివీడు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

55చూసినవారు
ఆకివీడు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
ఆకివీడు సర్కిల్ పరిధిలో నగలు, మోటార్ సైకిళ్లు దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, రూ. 17 లక్షల 20వేలు విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన బైరే వీరస్వామి, మహాదేవపట్నం గ్రామానికి చెందిన బలిరెడ్డి వరలక్ష్మి అనే మహిళను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్