ఆకివీడు తీగలదొడ్డి రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 7న శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు గేదెల అప్పారావు, సప్పా మణి కంఠ, శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సుమారు 40లక్షల వ్యయంతో 36 అడుగుల ఎత్తులో స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తున్నట్టు తెలిపారు.