ఆకివీడు మండలం దుంపగడపలోని ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు శతజయంతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించారు. అనంతరం విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.