కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. శనివారం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 10వేలకు పైబడి భక్తులు హాజరై అన్నదానం స్వీకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.