ప.గో: ప్రజలకు అందుబాటులో ఇసుక: కలెక్టర్

66చూసినవారు
ప.గో: ప్రజలకు అందుబాటులో ఇసుక: కలెక్టర్
ప. గో. జిల్లా ప్రజల అవసరాలకు స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచిన ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం కోరారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేనందున జిల్లా స్థాయి ఇసుక కమిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీపర్రు-2 ఇసుక రీచ్ నుండి ఇసుకను ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ కేంద్రాలకు తరలించి, స్టాక్ పాయింట్లో అమ్మకాలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్