కాళ్ళ మండలం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ధనుర్మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ, అష్టోత్తర శతనామార్చన, ఊంజల్ సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అలాగే శనివారం విశేష పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు వివిధ గ్రామల నుండి అత్యధికంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.