ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం దుంపగడప ఆంధ్ర కేసరి ప్రకాశం శతజయంతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారని అన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు విజయవంతం చేయాలన్నారు.