ఉండి: రేపటి నుంచి శ్రీ సత్తెమ్మతల్లి జాతర

85చూసినవారు
ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో శనివారం నుంచి శ్రీ సత్తెమ్మతల్లి 60వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు ప్రారంభం అవుతాయని కలిదిండి భాస్కర రాజు శుక్రవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని కమిటీ తెలిపింది. ఈ ఉత్సవాలకు గ్రామానికి చెందిన వారు దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ హాజరవ్వడం పరిపాటి. కాగా కలిదిండి వారి ఇంటి ఆడపడుచు అమ్మవారిగా అవతరించినట్లు చెబుతారు.

సంబంధిత పోస్ట్