చేబ్రోలు పీహెచ్ ఆసుపత్రిలో 40 మంది రక్తదానం

54చూసినవారు
చేబ్రోలు పీహెచ్ ఆసుపత్రిలో 40 మంది రక్తదానం
గుణ్ణం రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  శుక్రవారం  ఉంగుటూరు, నారాయణపురం,   చేబ్రోలు గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  40 మంది రక్తదానం చేశారు. నారాయణపురం
 సబ్ సెంటర్లో  ఆశా కార్యకర్తలకు, గొడుగులు, వాటర్ బాటిల్స్, విద్యార్థులకు నోటు పుస్తకాలు, క్రీడా పరికరాలను అందజేశారు. గుణ్ణం సురేష్ బాబు, వెజ్జు సుబ్బారావు, నల్ల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్