భీమడోలు శాఖ గ్రంథాలయంలో వేసవిజ్ఞాన శిక్షణ తరగతులు శనివారం ఘనంగా జరిగాయి. గ్రంథ పాలకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా తుమ్మల ఉమామహేశ్వరరావు, మండే సుధాకర్లు పాల్గొని చిన్నారులకు నీతి కథలు, పుస్తక సమీక్షల పై అవగాహన కల్పించారు. శిక్షణా తరగతులను సందర్శించిన భీమడోలు పోస్టుమాస్టర్ ప్రసాద్ తపాల శాఖ చిన్నారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక పథకాలను వివరించారు.