వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని, గుండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీలక్ష్మి కోరారు. భీమడోలులోని గ్రామ సచివాలయం పరిధి-1లో బుధవారం 104 వాహనం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 153 మంది రోగులకు వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు.