నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 45 రోజుల కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సును ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్
డాక్టర్ టి. కే విశ్వేశ్వరరావు గురువారం తెలిపారు. కళాశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుద్యోగులైన యువతీ యువకులు ఈ సర్టిఫికెట్ కోర్సులో చేరవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారికి రిజిస్ట్రేషన్ చేస్తామనన్నారు.