ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి అధిక పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి శెట్టి రామాంజనేయులు అన్నారు. నూక పేరుతో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వద్దిపర్రు గ్రామంలో ధాన్యం రాశుల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ పంట మాసూలు చేసి పది రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు.