ఉంగుటూరు మండలం నారాయణపురం టూరింగ్ పేట బిసి స్మశాన వాటికలో అక్రమంగా మట్టి తవ్వకాలను బుధవారం గ్రామస్తుల అడ్డుకున్నారు. తవ్వకాలలో జేసీబీ, మూడు ట్రాక్టర్ సంఘటన ప్రదేశంలో ఉన్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావును వివరణ కోరగా అక్రమ మట్టి తవ్వకాలు వాస్తవమేనన్నారు. దీనిపై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి తెలిపారు.