ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ విభాగం, తెలుగు శాఖ, సహజ యోగ సంస్థ ఆంద్రప్రదేశ్ విభాగం వారితో కలసి 45 రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సును గురువారం కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.కే విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. యోగ ఆసనాల సాధన వల్ల శారీరక, మానసిక, సమతౌల్య ఏర్పడుతుందన్నారు. అనేక రోగాలకు యోగాభ్యాసం నివారణ అని సూచించారు.