ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ విస్తరిస్తున్నది. ఇందులో 96 శాతానికిపైగా కేసులను కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు. మరో వైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్.. మరింత వ్యాప్తి చెందుతున్నది. దాంతో మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.