AP: బాపట్ల జిల్లాలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కొలుసు పార్థసారథి పర్యటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకి మద్దతుగా వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావంతులు ఆలోచించి ఓటు వేసి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, మరోసారి అధికారం ఇస్తే ఏపీని దేవుడు కూడా కాపాడలేడని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.