AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్‌ను దేవుడు కూడా క్షమించడని, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండించడం దారుణమన్నారు. తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే వాటిని ఖండించాల్సిన బాధ్యత జగన్‌కు లేదాంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారంటూ విమర్శించారు.