AP: ఎన్నికల సమయంలో హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వేధింపులే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను సైతం వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దెబ్బకి పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రం విడిచి పరారవుతున్నారన్నారు.