మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, ఇతర వైసీపీ నేతలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఇల్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వీరికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట మొదలైంది. నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో డిప్యూటీ మేయర్ శైలజ భర్త, వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.