వర్మ నిర్ణయంపై ఉత్కంఠ

82చూసినవారు
వర్మ నిర్ణయంపై ఉత్కంఠ
పిఠాపురంలో రాజకీయం మారుతోంది. టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. టీడీపీ నేత వర్మతో జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లోనూ వర్మకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీల అధినాయకత్వం కలిసే ఉన్నా.. పిఠాపురంలో మాత్రం వేర్వేరుగా కనిపిస్తున్నారు. దీంతో వర్మ మద్దతు దారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వర్మ ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైన ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్