ప్రస్తుత వర్షా కాలంలో చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ఈ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చినపుడు మటన్ తింటే త్వరగా జీర్ణం కాదు. చీజ్, సోడియం ఎక్కువగా ఉంటే పిజ్జా, పాస్తా తింటే రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది. ఇక బిర్యానీలలో మసాలాలు, ఉప్పు, కారం, నూనె వంటివి ఎక్కువ వాడతారు. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.