నిర్లక్ష్యం వల్లే బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు: ఎస్పీ తుహిన్ సిన్హా

58చూసినవారు
నిర్లక్ష్యం వల్లే బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు: ఎస్పీ తుహిన్ సిన్హా
AP: అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా స్పందించారు. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో బాణసంచా తయారీ కేంద్రం యజమాని సైతం మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి బాణసంచా కేంద్రం మేనేజర్‌పై కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్