బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు (వీడియో)

52చూసినవారు
తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. శివకాశి సమీపంలోని క్రాకర్స్‌ ఫ్యాక్టరీలో బుధవారం పేలుడు జరగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృత్యువాత పడ్డాడు. మరో ఏడుగురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

సంబంధిత పోస్ట్