శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దుబ్బగూడ గ్రామంలో ఉన్న గ్రానైట్ క్వారీలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు టెక్కలికి చెందిన అప్పన్న(35), రామారావు (40), తమిళనాడుకు చెందిన మురుగన్ (48)గా గుర్తించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్వారీ యాజమాన్యం పిడుగుపాటుతో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లు ఆరోపిస్తోంది. స్థానికులు మాత్రం పిడుగులు పడలేదని చెబుతున్నారు.