AP: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే రేపు(సోమవారం) పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.