AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో కనిపించిన నకిలీ ఐపీఎస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరంలో నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్య ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐపీఎస్ అని ఎందుకు చెప్పుకున్నావంటూ పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతని వెనుక ఎవరెవరు ఉన్నారు? ఎవరు సహకరించారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.