రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు: జగన్

63చూసినవారు
AP: రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ఎలాంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో రైతు రాజ్యం నడిచిందని, ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోగా ఆర్బీకేలా ద్వారా చెల్లించామన్నారు.

సంబంధిత పోస్ట్