AP: 175 నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రైతుబజార్లను 1999లో నేనే ఏర్పాటు చేశాను. రైతులకు గిట్టుబాటుధర రావాలి.. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 125 రైతు బజారులు ఉన్నాయి. రైతు బజార్లకు సేంద్రియ కూరగాయలు వచ్చేలా చూస్తాం’ అని అన్నారు.