సరదా కోసం కొందరు యువకులు చేస్తున్న రేస్ వారి ప్రాణాలమీదకు తెచ్చింది. రోడ్డుపై కొందరు యువకులు తమ బైక్‌లతో రేసింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు దారుణంగా ఢీకొన్నాయి. దీంతో ఒక బైక్‌పై ఉన్న యువకుడు ఎగిరి పడ్డాడు. కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.