ఏపీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

4657చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడప - చిత్తూరు హైవేలో కలకడ వద్ద ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంబేపల్లి మండలం దేవపట్ల నుంచి సొరకాయలపేటకు ఆటో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కలకడ, సంబేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్