ఇండోర్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

72చూసినవారు
ఇండోర్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
MPలోని ఇండోర్‌లో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్యాంకర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసు సూపరింటెండెంట్ రూపేష్ ద్వివేది వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గాయపడిన వారిని వెంటనే ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్